Harish Rao Nagarabata: త్వరలో సంగారెడ్డి జిల్లాలోని అన్నీ పురపాలికల్లో సైకిల్ యాత్ర చేస్తానని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నగర బాట పేరుతో జహీరాబాద్ పట్టణంలో సైకిల్‌పై తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ 50కోట్ల రూపాయలు మంజూరు చేశారని హరీశ్ రావు తెలిపారు. గతంలో జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి గీతారెడ్డి పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
జహీరాబాద్ తాగునీటి సమస్య తీర్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని హరీశ్ రావు పేర్కొన్నారు. త్వరలో సంగమేశ్వర ద్వారా నియోజకవర్గ పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. నిమ్జ్‌లో త్వరలో పరిశ్రమలు ప్రారంభం అవుతాయని.. దీంతో ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. రక్షణశాఖకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు... ఒప్పందాలు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.. నిమ్జ్‌లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. నిమ్జ్ మొదటి దశకు అన్ని అనుమతులు వచ్చాయి. త్వరలో అక్కడ ఒక డిఫెన్స్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒప్పందాలు కూడా జరిగాయి. త్వరలోనే డిఫెన్స్ ఫ్యాక్టరీతో పాటు పెద్ద పెద్ద కంపెనీలను జహీరాబాద్ నియోజకవర్గానికి తీసుకొస్తాం. దీనివల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానికులకు ఉద్యోగం ఇస్తే కంపెనీలకే ఇన్సెంటివ్స్ ఇస్తామనే కొత్త పాలసీని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. -హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
ఇవీ చదవండి: