ETV Bharat / state

'మంత్రి గారూ! శాశ్వతంగా ఉల్లి మార్కెట్ ఇక్కడే​ కొసాగించండి'

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మార్కెట్ యార్డులోనే ఉల్లిపాయల మార్కెట్​ను కొనసాగించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు.

'మంత్రి గారూ! శాశ్వతంగా ఉల్లి మార్కెట్ ఇక్కడే​ కొసాగించండి'
'మంత్రి గారూ! శాశ్వతంగా ఉల్లి మార్కెట్ ఇక్కడే​ కొసాగించండి'
author img

By

Published : May 9, 2020, 12:11 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మార్కెట్ యార్డ్​లో ఏర్పాటు చేసిన హోల్​సేల్ ఉల్లిపాయల మార్కెట్​ను శాశ్వతంగా ఇక్కడే నిర్వహించాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి వినతి ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మార్కెట్ యార్డ్​లో మలక్​పేట నుంచి తరలించిన హోల్​సేల్ మార్కెట్​ను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ఈనెల 6న ఉల్లిపాయల క్రయ విక్రయాలు పటాన్​చెరులో ప్రారంభించారు.

త్వరలోనే ఆర్థికశాఖ మంత్రితో కలిసి వస్తా...

ఇక్కడకు వచ్చే వ్యాపారులకు వసతులు ఏర్పాటు చేయాలని వినతిలో పేర్కొన్నారు. తాత్కాలిక షెడ్లు, సీసీ రహదారులు, నీటి సౌకర్యం, దుకాణ సముదాయం ముందు పెద్ద షెడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్​లో అదనంగా రెండు దుకాణాలు నిర్మించేలా చూడాలన్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి వచ్చి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇవీ చూడండి : మందుబాబులను చితకబాదిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.