కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో కరోనాను కట్టడి చేయాలనే నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ను విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాల సముదాయాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో పలు మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ తరుణంలో ఇలా బారులు తీరడం వల్ల కరోనా ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కనీస భౌతిక దూరం పాటించకుండా మద్యానికి ఎగబడుతున్నారు. కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఉన్నా... మందుబాబులు మద్యం కొంటున్నారు. పలు చోట్ల ఆందోళనలు చేశారు. మద్యం యజమానులు జాగ్రత్తలు చెప్పడం కూడా లేదు.. లాభలే ముఖ్యం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.