నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చివేస్తున్నామని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పేట గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆయన పరిశీలించారు. గత 15 రోజుల నుంచి భవనాలు కూల్చివేస్తున్నామని తెలిపారు.
జీప్లస్టు అనుమతి తీసుకుని అక్రమంగా నిర్మిస్తున్నారని... అదేవిధంగా అక్రమ లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సర్వే ద్వారా సేకరించామని వెల్లడించారు. వాటన్నింటినీ కూల్చేస్తామని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీల్లో గ్రామ కంఠం భూములు కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: వైరస్ భయం..కుటుంబంతో సహా పొలానికి మకాం