ఎరువుల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఖరీఫ్ కాలం నాటి పెట్టుబడి రాయితీ రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం సరికాదన్నారు. అన్నదాతలకు అవసరాలను తీర్చడంలో సర్కారు విఫలమైందని ఆరోపించారు. అనంతరం ఆర్డీవో రమేష్‌బాబుకు వినతిపత్రం అందించారు.
ఇవీ చూడండి: 'గణపతి బప్పా మోరియా... రైతులకు లేదు యూరియా'