ప్రజా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమౌతోందని భారతీయ యువ మోర్చా నాయకులు ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికైనా మేల్కొని సమస్యలపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
రిజర్వేషన్..
రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో ప్రైవేటు టీచర్లకు వేతనాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అగ్ర కులాలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'గొల్ల కురుమలు కట్టిన డబ్బు వడ్డీతో సహా ఇవ్వాలి'