సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వైపు వస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అందోల్ మండలం సంగుపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఏపీలోని అనంతపురంలో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి