హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. సేద్యాన్ని లాభసాటిగా మార్చాలన్నది సర్కార్ లక్ష్యమని తెలిపారు. వర్సిటీ అగ్రో టెక్నాలజీ పబ్లికేషన్స్, ఇతర పత్రాలను మంత్రి విడుదల చేశారు. విత్తన జన్యు పరిశోధనలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె వర్షిణేకు నిరంజన్‌రెడ్డి.. ప్రొఫెసర్ జయశంకర్ జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు, ఇక్రిశాట్ జెనిక్ గెయిన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ కె వర్షిణే, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దత్తాత్రేయను కలిసిన తెరాస ఎంపీ డీఎస్