పుర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మణికొండ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి కస్తూరి విజయ తనను గెలిపిస్తే చేసే పనులను బాండ్ పేపర్‌పై రాసి ఓటర్లకు అందచేశారు. తనను గెలిపించి మణికొండ అభివృద్ధికి కృషి చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పాల్గొన్నారు. న్యాయానికి, నిజాయతీకి ఓటర్లు అధికారం కట్టబెట్టాలని.. ఓటును అమ్ముకోవద్దని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.
ఇవీ చూడండి: '9 పురపాలికల్లో గెలిచి కేసీఆర్, కేటీఆర్‌కు కానుకగా ఇస్తా'