తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలోని ఆర్టీసీ బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వాయిదా వేసినప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించటం లేదని కార్మికులు మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఇప్పటికీ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!