రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బహుజన పూజారుల సేవాసమితి ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. మెుత్తం 2116 మంది శివ సత్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ నుంచి పట్టణ వీధుల గుండా నెత్తిన బోనాలతో తమ సమస్యలను నెరవేర్చాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హజరయ్యారు.
ఈ సందర్భంగా శివ సత్తులతో కలిసి ఎంపీ బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరి కష్టాలు తొలగి దేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే అమ్మ వారిని వేడుకున్నానని ఎంపీ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కాంగ్రెస్ నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు