ETV Bharat / state

డ్రోన్‌తో విత్తనం...కేటీఆర్ ప్రశంసల వర్షం - Seedling with drone

పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో సిరిసిల్ల జిల్లా అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. డ్రోన్‌తో విత్తన బంతులను చల్లేవిధానంతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికి కేటీఆర్​ అటవీ అధికారులను అభినందించారు.

seedling-with-drone-at-siricilla-district
డ్రోన్‌తో విత్తనం... కేటీఆర్‌ అభినందనలు​
author img

By

Published : Feb 18, 2020, 10:22 AM IST

Updated : Feb 18, 2020, 12:05 PM IST

సిరిసిల్ల నియోజకవర్గంలో హరితహారంలో భాగంగా విత్తన బంతులు విసరడానికి డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. వీర్నపల్లి అడవుల్లో పండ్ల తోటలు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా 15వేల విత్తన బంతులు తయారు చేసి... అవి విసరడానికి డ్రోన్‌ను వినియోగిస్తున్నారు.

రావి విత్తనాలతో కూడిన బంతులు 4వేలు, జువ్వికి సంబంధించి 4వేల, సీతాఫలానికి సంబంధించి 1,000విత్తన బంతులతో పాటు కానుగ, మర్రి విత్తనాల బంతులు తయారు చేశారు. అడవుల్లో డ్రోన్‌ ద్వారా విసిరే ప్రక్రియను అటవీశాఖ అధికారులు ప్రారంభించారు.

హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు డ్రోన్‌ కెమెరాతో విత్తన బంతుల ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు, అటవీశాఖ అధికారులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో ట్విట్‌ చేశారు.

డ్రోన్‌తో విత్తనం... కేటీఆర్‌ అభినందనలు​

ఇదీ చూడండి: వెంటాడుతున్న పెద్ద పులుల భయం

Last Updated : Feb 18, 2020, 12:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.