పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో నిరుపేదలకు, అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తూ వారి కష్టాలను దూరం చేస్తోంది గోదావరిఖని విజయమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు కోరుకంటి మణిదప్. ఈ క్రమంలో భాగంగానే మరో అడుగు ముందుకు వేసి మూగజీవాల ఆకలి, దప్పికలను తీర్చారు.
మంథని-కాటారం దారిలో మూగ జీవలైనా కోతులకు ఆహారం దోరకడం లేదని తెలుసుకొని స్వయంగా పండ్లు, నీటిని తీసుకొని వెళ్లి వాటికి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఇరుగురాల శ్రావణ్, బూరుగు వంశీకృష్ణ ,అబ్బాస్, చిట్టవేణి వేణు, బైరి శ్రీకాంత్, మానుపాటి శ్రీనివాస్, మున్నా, దరిపెళ్ళి శ్రీకాంత్, సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?