ETV Bharat / state

'మొక్కలు నాటడం, బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకోవాలి' - పోలీస్​ ఉద్యాన వనం తాజా వార్త

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొలమద్ది గ్రామంలో పోలీస్ ఉద్యాన వనాన్ని ఆయన ప్రారంభించారు.

The police park was inaugurated during the HarithaHaram program at Kolamaddi village in Rajanna sirsilla district
'మొక్కలను బహుమతిగా ఇవ్వడం, నాటడం ఒక ఆనవాయితీగా మారాలి'
author img

By

Published : Sep 5, 2020, 8:32 AM IST

హరితహారంలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొలమద్దిలో నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ ఉద్యాన వనాన్ని ఎస్పీ రాహుల్​ హెగ్డే ప్రారంభించి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో చెట్లు కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు.

భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం, బహుమతిగా అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ బన్సీలాల్, ఆరై అడ్మిన్ సంపత్ కుమార్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, అభిలాష్, రఫీక్ ఖాన్, రామచంద్రమ్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.