ETV Bharat / state

'ఓ రోజు గడిచిపోయింది.. పరిహారం మాత్రం అందలేదు' - పెద్దపల్లి జిల్లా రామగుండం తాజా వార్త

రామగుండం సింగరేణి ఉపరితల గనిలో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన నలుగురి మృతదేహాలకు ఇంకా శవపరీక్ష పూర్తి కాలేదు. పరిహారంపై సింగరేణి, మహలక్ష్మి కంపెనీతో కార్మికసంఘాల నాయకుల చర్చలు విఫలమయ్యాయి. కోటి రూపాయల పరిహారం సహా కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకు సింగరేణి నుంచి హామీ రాకపోవడం వల్ల... ఆందోళన కొనసాగుతోంది.

singareni-worker-union-protest-in-front-of-singareni-gm-office-and-the-negotiations-are-failed
24 గంటలవుతుంది... పరిహారం మాత్రం లేదు: సింగరేణి కార్మిక సంఘాలు
author img

By

Published : Jun 3, 2020, 4:04 PM IST

Updated : Jun 3, 2020, 8:03 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఓసీపీ-1 ప్రమాదంలో మరణించిన నలుగురు ఒప్పంద కార్మికుల మృతదేహాలకు ఇంకా శవపరీక్ష జరగలేదు. పరిహారంపై మహాలక్ష్మి కంపెనీ, సింగరేణి యాజమాన్యంతో చర్చలు సఫలం కాలేదు.

'ఓ రోజు గడిచిపోయింది.. పరిహారం మాత్రం అందలేదు'

మృతుల కుటుంబాలకు మద్దతుగా ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించి సింగరేణి ఏరియా ఆస్పత్రి వద్దకు తరలివచ్చి... నిరసన చేపట్టారు. కోటి రూపాయల పరిహారం సహా మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖ ఎల్జీ పాలీమర్స్‌ గ్యాస్‌లీకేజీ ఘటనలో బాధితులకు ఏపీ సీఎం జగన్‌ కోటి రూపాయలు ఇచ్చిన మాదిరిగా.... పరిహారం ప్రకటించాలని స్పష్టం చేస్తున్నారు.

గోదావరిఖని జీఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. సింగరేణి నుంచి 28 లక్షలు మృతుల కుటుంబానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్మిక సంఘాల నాయకులు ఇందుకు ఒప్పుకోలేదు.

యాజమాన్యం తమ డిమాండ్లకు ఒప్పకోలేదని... చర్చలు విఫలమయ్యాయని కార్మిక నాయకులు తెలిపారు. కార్మిక సంఘాల నాయకులు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని తెరాస నాయకుడు సత్యనారాయణ గౌడ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్థిచెప్పారు.

నలుగురు ఒప్పంద కార్మికుల మృతికి సింగరేణి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్​ఎంఎస్​ ప్లాంట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం

Last Updated : Jun 3, 2020, 8:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.