పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో గోదావరిఖని ఒకటో బొగ్గు గని వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఇసుక బంకర్ వద్ద రెండు కుక్కలపై దాడి చేయడంతో పులి తిరుగుతుందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనలో రెండు కుక్కలు మృతి చెందగా, మరో కుక్క ఆచూకి కనబడకపోవటంతో కార్మికులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. గని మేనేజర్ సంఘటన స్థలానికి చేరుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు.

పులి సంచరిస్తోందని కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు జంతువు అడుగులను గుర్తించారు. అవి పులి అడుగులేనా? లేదా వేరే జంతువు అడుగులా? అని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: రైతుబంధు పంపిణీకి సన్నద్ధం.. ఎకరాలోపు రైతులకు తొలి ప్రాధాన్యం