నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. వీసీ ఛాంబర్ ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. యూనివర్సిటీలో వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రిపూట ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. హెల్త్ సెంటర్ భవనం నిర్మించినప్పటికీ.. ఇంకా ప్రారంభానికి నోచుకోవడంలేదని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం