మహిళలపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారు. ఆడవారని చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన నిజామాబాద్లో జరిగింది. పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్కాలనీలో తెరాస అభ్యర్థి, కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడున్న మహిళలను నెట్టేసి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు.
అదనపు సీపీకి ఫిర్యాదు
లాఠీ చార్జీ చేసి భాజపా అభ్యర్థితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ అర్వింద్ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసినా భాజపా అభ్యర్థి, కార్యకర్తలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో అదనపు సీపీకి ఫిర్యాదు చేశారు. మహిళను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళను ఈడ్చుకుంటూ వెళ్లే, లాఠీ ఛార్జి చేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి