ETV Bharat / state

నిజామాబాద్​​ చేరుకున్న చక్కెర కార్మికుల పాదయాత్ర - నిజాం దక్కన్‌ షుగర్స్ కార్మికుల పాదయాత్ర

'ఆకలి పోరు- పాదయాత్ర'లో భాగంగా నిజాం షుగర్స్​​ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన పాదయాత్ర నిజామాబాద్​కు చేరుకుంది. ఐదేళ్లుగా భిన్న రూపాల్లో ఆందోళన నిర్వహించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని కార్మిక నాయకులు వాపోయారు.

nizam deccan sugars factory workers paadayatra
ఆకలి పోరు- పాదయాత్ర, నిజాం దక్కన్‌ షుగర్స్
author img

By

Published : Feb 9, 2021, 1:01 PM IST

వేతన బకాయిలు చెల్లించి.. జీవనోపాధి చూపి తమ భవితవ్యం తేల్చాలంటూ 'నిజాం దక్కన్‌ షుగర్స్‌' బోధన్‌ యూనిట్‌ కార్మికులు చేపట్టిన 'ఆకలి పోరు- పాదయాత్ర' నిజామాబాద్​ చేరుకుంది. ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం తమ వివాదాన్ని పరిష్కరించకుండా 2015 నుంచి లే ఆఫ్‌ ప్రకటించడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని నాయకులు ఉపేందర్‌, కుమారస్వామి పేర్కొన్నారు. జీవనోపాధి కోల్పోయి తమ జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదేళ్లుగా భిన్న రూపాల్లో ఆందోళన నిర్వహించినా సరైన న్యాయం జరగడంలేదని నాయకులు వాపోయారు. బడ్జెట్‌ సమావేశాల నాటికి సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో యాత్ర చేపట్టామని వివరించారు. వెళ్లే మార్గంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరతామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ వెళ్లాక సీఎం, కార్మిక, పరిశ్రమల శాఖల మంత్రులను కలిసి తమ గోడు వినిపిస్తామని వెల్లడించారు.

నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను తీర్చాలని డిమాండ్​ చేస్తూ బోధన్​ నుంచి హైదరాబాద్​ వరకు కార్మికులు సోమవారం పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు నిజామాబాద్​ చేరుకున్నారు.

ఇదీ చదవండి: లోటస్​పాండ్​లో అభిమానులతో షర్మిల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.