ETV Bharat / state

'పసుపు బోర్డు ఏర్పాటు ఎప్పుడు చేస్తారు...?'

నిజామాబాద్​ ఆర్మూర్​లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్​ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహించారు. ఎంపీగా గెలిచి మూడు నెలలు అవుతున్నా ఇంకా కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానని అన్నారని ప్రతినిధులు గుర్తు చేశారు.

రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు
author img

By

Published : Jul 29, 2019, 10:43 AM IST

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​, భాజపా అగ్రనాయకులు రాజ్​నాథ్​ సింగ్​, రామ్​ మాధవ్​లపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆర్మూర్​లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. మాట తప్పారని ధ్వజమెత్తారు. అర్వింద్​ గెలిచాక నెలరోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని.. మూడు నెలలు కావొస్తున్నా.. ఎలాంటి కదలిక లేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకుంటే రాజీనామా చేస్తానని బాండ్​ పేపర్​ కూడా విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ నెల 26న దిల్లీలో జరిగిన సమావేశంలో పసుపు పంటను ఎలా పండించాలో ఎంపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అర్వింద్​ తను చిత్తశుద్ధిగా నెరవేర్చకపోతే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.

పసుపు బోర్డుపై ఎలాంటి కదలిక లేదు

ఇవీ చూడండి : జగిత్యాల జిల్లాలో.. వెన్నలగండి పర్యాటకం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.