నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని పెద్ద చెరువులో మొసలి కలకలం రేపుతోంది. ఊరు పక్కనే ఉన్న పెద్ద చెరువులో మొసలి కనపడటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. మొసలి కనిపించడం వల్ల పనులు చేసుకునేందుకు భయపడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.
ఒకరి ద్వారా ఒకరు విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా వెళ్లి మొసలిని చూశారు. వారి కళ్ల ముందే అది బురద నీటిలోకి జారుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'