యూరియా కొరత తీర్చాలంటూ నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చి, మాట తప్పారన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా: పవన్