శాసనమండలి ఎన్నికల్లో ఓటేసిన ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న అటవీ శాఖ మంత్రి
శాసనమండలి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ 50లో ఇంద్రకరణ్ రెడ్డి ఓటు వేశారు. కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి.
sample description