నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో రద్దీ పెరిగింది. సర్కారు సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించాలని... వినియోగదారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. కరోనా నివారణ చర్యలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి దృష్ట్యా కూరగాయల మార్కెట్‌తోపాటు మటన్ మార్కెట్‌ను పాత వ్యవసాయ మార్కెట్లోకి అధికారులు తరలించారు.
ప్రభుత్వం ప్రసార మాధ్యమాల్లో కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ, మిర్యాలగూడ ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేవిధంగా ఉంది. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.