నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం జానారెడ్డి కాలనీ వద్ద బత్తాయిలు తెంపడానికి వెళ్తున్న కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో ఆటోలో 15 మంది కూలీలున్నారు. అందులో కొందరికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని నాగార్జున సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషమ పరిస్థితిలో ఉన్న క్షతగాత్రుడిని నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కూలీలు తిరుమలగిరి మండలం జాల్ తండాకు చెందిన వారని స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ