నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం మేడారాన్ని అతలాకుతలం చేసింది. వర్షానికి జాతర పరిసర ప్రాంతాలన్నీ బురదమయ్యాయి. పారిశుద్ధ్యం లోపించి ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. చెత్తకుప్పల నుంచి వస్తున్న దుర్గంధం కారణంగా అటువైపుగా భక్తులు నడవడానికి జంకుతున్నారు.
భక్తులతో పాటు దుకాణాదారులు కూడా వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వ్యాపారం కోసం వేసుకున్న తాత్కాలిక గుడారాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరి వ్యాపార వస్తువులు మొత్తం తడిసిపోయాయి.
ఇదీ చూడండి : తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి