మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి.. మల్కాజ్గిరి పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింహ రెడ్డితో కలిసి బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు శ్వేత. ఆసుపత్రి అవసరాలకు దగ్గర్లోని జీహెచ్ఎంసీ భవనాలను ఉపయోగించాలని సూచిస్తూ.. ఆసుపత్రి సూపరిండెంట్‌కు లేఖ అందజేశారు.
ఇదీ చదవండి: కంపు కొడుతోన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం