మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో నిర్వహించిన 73 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ ఎం.వి రెడ్డితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విత్తన బంధం ఈ రక్షా బంధనం