నీటి సమస్య లేకుండా చర్యలు మెదక్లో మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. వేసవిలో నీటి సమస్య, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులు చేపట్టకూడదని నిర్ణయించారు. మిషన్ భగీరథ తవ్వకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... త్వరగా పనులు పూర్తి చేయాలని కాట్రాక్టర్ను ఆదేశించారు. మెదక్ పట్టణంలో రోడ్లు గుంతల మయంగా మారాయని వెంటనే మరమ్మతులు చేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు.
వేసవి కాలంలో మంచి నీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'