మెదక్ జిల్లా శివ్వంపేట గ్రామ సహకార సంఘం ఎదుట పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన చేశారు. కోనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా... అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు జరపకపోతే... ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.
అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో... కొందరు రైతులు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నంచారు. విషయం గుర్తించిన మరికొంత మంది రైతులు పురుగుల మందు డబ్బాలను పక్కన పడేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నోరుమెదపకపోవడం కొసమెరుపు. కాసేపు నిరసనను కొనసాగించిన అన్నదాతలు కొనుగోళ్లు జరుగుతాయో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తూ... వెనుదిరిగారు.
ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో