ఆర్టీసీ కార్మికుల సమ్మె 42వ రోజూ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో కార్మికులు ముఖాలకు నల్లమాస్కులు ధరించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఒంటి కాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!