ETV Bharat / state

హమాలీ కాలనీలో ఇళ్ల కూల్చివేతపై భాజపా నిరసన..

మెదక్​ జిల్లా కేంద్రంలో హమాలీలకు కేటాయించిన ఇళ్లను కూల్చివేయడంపై స్థానిక భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారికి డబుల్​ బెడ్​ రూం ఇళ్లను ఇస్తామన్న ప్రభుత్వం.. కట్టిన ఇళ్లను కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. కాగా 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వం.. వాల్మీకి అంబేడ్కర్​ ఆవాస్ యోజన కింద 44 మంది హమాలీలకు ఇళ్లు మంజూరు చేసింది. కానీ కొందరు లబ్ధిదారులు ఆ ఇళ్లను వినియోగించుకోవడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ స్థలాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయిస్తూ ఆ ప్రాంతాన్ని చదును చేయించే యోచనలో ఉంది.

bjp protests agianst houses collapsed in hamali colony
హమాలీ కాలనీలో ఇళ్ల కూల్చివేతపై భాజపా నిరసన..
author img

By

Published : Nov 13, 2020, 5:16 PM IST

మెదక్​ జిల్లా కేంద్రంలో హమాలీ కాలనీలోని పేదల ఇళ్ల కూల్చివేతపై నిరసన వ్యక్తమవుతోంది. పేదవారికి డబుల్ బెడ్ ​రూం ఇళ్లను ఇస్తామన్న ప్రభుత్వం.. కట్టిన ఇళ్లు కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని స్థానిక భాజపా నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జిల్లా భాజపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, పార్టీ శ్రేణులు.. కాలనీని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

1992లో హమాలీలకు ఇళ్లు

స్థానిక హమాలీ కాలనీలో 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వం.. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన పథకం కింద 44 మంది హమాలీలకు ఇళ్లు మంజూరు చేసింది. ఆ ఇళ్లలో కొందరు నివాసం ఉండగా మరికొన్ని ఖాళీగా ఉన్నాయి. కాగా కొందరు లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్లను వినియోగించుకోవడం లేదని నాలుగేళ్ల కిందట ప్రభుత్వం ఆ ఇళ్లను రద్దు చేసింది. ఈ క్రమంలో ఆ కాలనీ స్థలాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కేటాయిస్తూ కలెక్టర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని చదును చేసేందుకు అక్కడ ఉన్న ఇళ్ల కూల్చివేత ప్రారంభించారు. విషయం తెలుసుకున్న హమాలీలు అక్కడికి చేరుకుని తమకు కేటాయించిన ఇళ్లను కూల్చివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భాజపా నేతలు నిరసన వ్యక్తం చేశారు.

మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హమాలీ కాలనీ సందర్శించి ఇచ్చిన మాట ప్రకారం కాలనీ వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. హమాలీల ఇళ్లను క్రమబద్ధీకరించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.