మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని మ్యాన్ వైండింగ్ షాప్ట్ను సింగరేణి యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. షాప్ట్లో పలు విభాగాలను సింగరేణి డైరెక్టర్ పీ భాస్కర్ రావు, ఈఎమ్ డైరెక్టర్ శంకర్లు ప్రారంభించారు. 2013లో ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి, ఏడేళ్ల తర్వాత నిర్మాణాన్ని సమర్థవంతంగా పూర్తి చేశారు.
షాప్ట్ నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు సింగరేణి ఖర్చు చేసిందని భాస్కర్ రావు అన్నారు. గతంలో రెండు గంటల్లో పని ప్రదేశాలకు వెళ్లే సమయం.. ప్రస్తుతం 15 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఐదో షాప్ట్ను ప్రారంభించమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని బొగ్గు ఉత్పత్తిని పెంచుతామన్నారు. కార్మికులు కష్టపడి పనిచేసి బొగ్గు ఉత్పాదకతను పెంచాలన్నారు. సాంకేతిక జ్ఞానంతో షాప్ట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ వెంకటేశ్వర్లు, మందమర్రి జీఎం రమేష్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 50 క్వింటాళ్ల మిరపకు నిప్పుపెట్టిన దుండగులు