బాలింతలకు, శిశువులకు అందించే పోషకాహారంపై అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
పౌష్టికాహారం గురించి తెలియజేసే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లల్లో పౌష్టికాహారం లోపం రాకుండా కృషి చేస్తామని పాలనాధికారితో పాటు అంగన్‌వాడీ సిబ్బంది, యువత ప్రతిజ్ఞ చేశారు. పోషణ పక్షోత్సవాల్లో కిశోర బాలికలకు, బాలింతలకు, శిశువులకు పోషకాహార విలువలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు.