మంచిర్యాలలో నిర్వహించిన రెవెన్యూ మేళాకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ మేళాలో 35 దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషనర్ స్వరూప రాణి చెప్పారు. ఇంటి పన్ను అధికంగా వస్తోందని 12 దరఖాస్తులు రాగా.. ఇంటి యజమాని పేరు తప్పుగా నమోదైందని 18, యజమాని పేరు ఆన్లైన్లో నమోదు కాలేదని ఐదు దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
ఈ నెల 15 వరకు 2019-20 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలను చెల్లించని వారికి అపరాధ రుసుము పై90% తగ్గింపు ఇస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. దీంతో పాత మంచిర్యాల పురపాలక పరిధిలోని 9వ వార్డుకు చెందిన జ్యోతి టైల్స్ నిర్వాహకులు 12 లక్షల 39 వేల 245 రూపాయల పన్ను చెల్లించారు.
ఇదీ చదవండి: నిండుకుండలా పులిచింతల... 14గేట్ల ద్వారా నీటి విడుదల