ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఐదు చోట్ల మైనార్టీ గురుకుల ఇంటర్ కళాశాలలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటివరకు పదోతరగతి వరకు ఉన్న గురుకులాలు.. ఇప్పుడు ఇంటర్ విద్యను అభ్యసించేందుకు మైనార్టీ పేద గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.
మహబూబ్నగర్, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తకోట ప్రాంతాల్లో ఇంటర్ బాలుర కళాశాలలు, గద్వాలలో బాలికల కళాశాల ప్రారంభించనుంది. ఇందుకు నూతన భవనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నాలుగు వందల మంది విద్యార్థులతో బోధన అందించేందుకు తగిన వసతులు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గురుకులాలు, విద్యాసంస్థలు మూసివేసి ఉన్నాయి. ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. కళాశాలలు ప్రారంభంకానున్నాయి.
ఇదీ చూడండి: 'కరోనా వైరస్ మళ్లీ తిరగబెట్టవచ్చు... అప్రమత్తత అవసరం'