మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో ఓ రైతు నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. కొత్తూరు గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం విద్యుత్ శాఖ అధికారి పర్వతాలు లంచం డిమాండ్ చేశాడు. దిక్కుతోచని రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకుటుండగా అనిశా డీఎస్పీ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
- ఇదీ చూడండి : భద్రాచలం వద్ద దుకాణాల్లోకి చేరిన వరదనీరు