మహబూబ్నగర్లో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు మహబూబ్నగర్లో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి మహిళా సాహిత్య సదస్సు జరిగింది. ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభ ఉన్న తెలంగాణ కవులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల, మహిళ సాహిత్యంతో పాటు మరిన్ని వాటిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.ఇలాంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నందిని సిధారెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:'చేవెళ్ల గెలుపు.. మినీ ఇండియా గెలుపు'