ETV Bharat / state

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

author img

By

Published : Aug 29, 2019, 8:45 AM IST

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని... రానున్న వినాయక చవితి, మొహరం పండుగల పట్ల జాగ్రత్తలు వహించాలని మహబూబ్ నగర్ జిల్లా ఇన్​ఛార్జ్ సంయుక్త కలెక్టర్ స్వర్ణలత అభిప్రాయపడ్డారు.

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

రానున్న పండుగల పర్వదినాలను పురస్కరించుకుని మహబూబ్​నగర్ కలెక్టరేట్​లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శాంతి సమావేశం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సంయుక్త కలెక్టర్ స్వర్ణలత ఆదేశించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పకుండా అనుమతులు తీసుకోవాలని... శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేసి అన్ని మండపాల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నామని ఎస్పీ తెలిపారు.

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

ఇవీ చూడండి:ఔరా 'జైస్వాల్'... అమె సకల కళల ఛాంపియన్!

Intro:TG_MBNR_22_28_Piece_Committe_Meet_On_Festivals_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ స్వర్ణలత అభిప్రాయపడ్డారు. రానున్న వినాయక చవితి, మొహారం పండుగలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శాంతి సమావేశం నిర్వహించారు.

Body:రానున్న పండుగల పర్వదినాలను పురస్కరించుకొని మహబూబ్ నగర్ కలెక్టరేట్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శాంతి సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నవరాత్రి ఉత్సవాలు ని మొహరం పండుగ సైతం రావడంతో మతసామరస్యం తో కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ ప్రతిమల నిమజ్జనానికి సైతం అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Conclusion:గణేష్ మండపాల నిర్వాహకులు తప్పకుండా అనుమతులు తీసుకోవడంతో పాటు శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. వినాయక మండపాలు ఏర్పాటు అనంతరం మండపానికో కానిస్టేబుల్ ను ఇన్చార్జిగా నియమించడంతో పాటు 24 గంటలు పోలీసులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దాంతో పాటు రాత్రి సమయాల్లో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి అన్ని మండపాల ప్రాంతాలలో పెట్రోల్ నిర్వహించనున్నామని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.......bytes
బైట్స్
స్వర్ణలత, ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్.పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.