ETV Bharat / state

దేవరకద్ర మార్కెట్​కు కొత్త ఉల్లి.. వ్యాపారుల ఆసక్తి

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లోకి కొత్త ఉల్లి అమ్మకానికి వచ్చింది. క్వింటాల్​ ధర రూ.3500 వరకు ఉండగా.. ఉల్లిని కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రయ, విక్రయదారులతో మార్కెట్​ కళకళలాడుతోంది.

New onion for Devarakadra market
దేవరకద్ర మార్కెట్​కు కొత్త ఉల్లి.. వ్యాపారుల ఆసక్తి
author img

By

Published : Feb 24, 2021, 3:55 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి విక్రయానికి వచ్చింది. గత వారం క్వింటాల్​ ఉల్లి కనిష్ఠంగా రూ.3,100, గరిష్ఠంగా రూ.4,200 వరకు కొనసాగింది. కొత్త ఉల్లి రాకతో క్వింటాల్​ ధర సుమారు రూ.700 వరకు తగ్గి, రూ.3500 కొనసాగింది.

మరోవైపు ఇతర మార్కెట్లలో ఆశించిన స్థాయిలో ఉల్లి లభించకపోవటం వల్ల వ్యాపారులు సైతం ఇక్కడ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు మార్కెట్​కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను పరామర్శించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.