భారత్- చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. మహబూబ్నగర్ కోర్టు కాంప్లెక్స్ నుంచి తెలంగాణ న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం సరిహద్దుల్లో పొరుగుదేశాలతో పోరాటం చేస్తూ వీరమరణం పొందిన జవానులకు సంతాపం తెలిపారు.
భారతదేశాన్ని ఏ దేశం కూడా ఓడించలేదని ధీమా వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న ఘటనలను యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి జవానులకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఇవీ చూడండి: రేపు ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు