న్యాయవ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న న్యాయస్థానాలను, కోర్టు భవనాలను జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. న్యాయమూర్తులకు, కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులకు అందుతున్న సేవలు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. సుప్రీం ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న కేసులను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన న్యాయవాదులను కోరారు. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలో 41 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని.. 2014 లోపు ఉన్న పెండింగ్ కేసులని మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇవీ చూడండి: 'ప్రశ్నిస్తేనే సమాజం చైతన్యవంతమవుతుంది'