సంబురాలు చేసుకుంటున్న నాయకులు పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయు సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై విజయవంతంగా దాడులు చేయడంపై నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల పక్షం నాయకులు సంబురాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజని అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడిలో మరణించిన 44 మంది వీర జవాన్లకు ఇదే సరైన నివాళి అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:పాక్పై ద్వేషం లేదు