రైతులకు వ్యవసాయ పని కంటే ఎరువుల కోసం తిరగడానికే సమయం సరిపోతోంది. మహబూబాబాద్‌లో యూరియా కోసం నిరీక్షణ దారుణంగా ఉంది. ఉదయం 5 గంటలకే క్యూలైన్లలో నిల్చొని సొసైటీ కార్యాలయాన్ని ఎప్పుడు తెరుస్తారోనని ఎదురు చూస్తున్నారు కర్షకులు. ఓరుగల్లు కోపరేటివ్ సొసైటీ ముందు మహిళ, పురుష రైతులు బారులు తీరారు. ఒక్కొక్క రైతుకు 2 బస్తాల యూరియానే ఇస్తున్నారు. క్యూలైన్లో నిలబడిన రైతులందరికీ బస్తాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. మహబూబాబాద్ మండలానికి ఇప్పటి వరకు 2600 టన్నుల యూరియా వచ్చిందని, మరో 1400 టన్నుల యూరియా రావాల్సి ఉందని మండల వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి