మహబూబాబాద్ జిల్లా బస్టాండ్ ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు పెట్టి.. మిగిలిన సమస్యలు పరిష్కరించాలని కోరినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వైఖరి మారకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.