సీజనల్ వ్యాధుల నివారణకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రతి ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాల కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో చెట్ల కుండీల్లో చెత్తను తొలగించారు. నిలువ నీటిని పారబోశారు. అనంతరం గార్డెన్లో చెత్తా, చెదారం తీసేసి పరిసరాలను శుభ్రం చేశారు.
మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇదీచూడండి: దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్