మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్‌ను పారిశుద్ధ్య, ఆరోగ్య సిబ్బందికి మంత్రి దగ్గరుండి వేయించారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కృషి వల్లే ఈ రోజు దేశ, రాష్ట్ర ప్రజలందరికీ కరోనా నియంత్రణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఎర్రబెల్లి తెలిపారు. ఈ వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి : వ్యాక్సినేషన్‌పై వచ్చే వదంతులను నమ్మొద్దు: సీఎస్