ETV Bharat / state

రహదారి కోసం చేపలు పడుతూ నిరసన తెలిపిన గ్రామస్థులు

తమ సమస్యను తెలిపేందుకు గ్రామస్తులు నిల్వ ఉన్న నీటిలో చేపలు పట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.

దారికోసం చేపలు పడుతూ నిరసన తెలిపిన గ్రామస్థులు
రహదారి కోసం చేపలు పడుతూ నిరసన తెలిపిన గ్రామస్థులు
author img

By

Published : Aug 17, 2020, 5:38 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కిరిడి గ్రామానికి రోడ్డు లేక గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తమ సమస్యను తెలిపేందుకు గ్రామస్తులు నిల్వ ఉన్న నీటిలో చేపలు పట్టి నిరసన తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలంలో రోడ్డు కోసం కిరిడి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్ర చేసి అప్పటి పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

రోడ్లన్నీ బురదమయం...

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలిబాటలన్ని బురదమయంగా మారాయి. ఆ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని పోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. 74 ఏళ్ల నుంచి ఇదే స్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిరిడి గ్రామాన్ని సందర్శించి రోడ్డు వేయాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి : విద్యుత్​శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి: ప్రభాకర్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.