ETV Bharat / state

కేవలం 5 గంటల్లోనే ముగిసిన దస్త్రాల అప్పగింత ప్రక్రియ - ఆసిఫాబాద్​ జిల్లా వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని వీఆర్‌ఓలు సోమవారం తమ ఆధీనంలోని భూరికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. ఈ ప్రక్రియ కేవలం 5 గంటల్లోనే పూర్తయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డుల అప్పగింత పూర్తయింది.

records handover process completed  with in five hours in asifabad
కేవలం 5 గంటల్లోనే ముగిసిన దస్త్రాల అప్పగింత ప్రక్రియ
author img

By

Published : Sep 8, 2020, 10:18 AM IST

రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా వీఆర్‌ఓల సర్దుబాటు దిశగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని వీఆర్‌ఓలు సోమవారం తమ ఆధీనంలోని భూరికార్డులను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించారు. ఈ ప్రక్రియ కేవలం 5 గంటల్లోనే పూర్తయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రికార్డుల అప్పగింత పూర్తయింది.

రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిపరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు తెరుచుకునే అవకాశాలు లేవు. ఈ నిర్ణయంతో మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.

అప్పగించిన ముఖ్యమైన రికార్డులు ఇవే..

  • మాన్యూవల్‌ పహణి
  • ధరణి పహణి ● 1బి ● ఫాం -7
  • విరాసత్‌తో పాటు ఇతర పెండింగ్‌ దరఖాస్తులు
  • గ్రామాల వారీగా రైతుల పూర్తి సమాచారం

ఇవీ చూడండి: నవ తెలంగాణే లక్ష్యంగా.. సంస్కరణలు, చట్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.