కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణబాబు పేర్కొన్నారు. జిల్లా కోర్టుల సముదాయంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన పాల్గొన్నారు. ఇరువురు కక్షిదారులు రాజీ మార్గంలో కేసును పరిష్కరించుకునేందుకు ఇది వేదికగా నిలుస్తుందన్నారు. డబ్బు, సమయం ఆదా కావడంతో పాటు సత్వర పరిష్కారం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆన్లైన్కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!